కాల్పుల ఘటనపై డీజీపీ మహేందర్ రెడ్డి స్పందిం చాలి

కాల్పుల ఘటనపై డీజీపీ మహేందర్ రెడ్డి స్పందిం చాలి

హైదరాబాద్, వెలుగు: మంత్రి శ్రీనివాస్ గౌడ్​ను కేబినెట్ నుంచి భర్తరఫ్ చేయాలని ఎమ్మెల్యే రఘునందన్​రావు డిమాండ్ చేశారు. కాల్పుల ఘటనపై డీజీపీ మహేందర్ రెడ్డి స్పందిం చాలన్నారు. ఇప్పటివరకు మంత్రి వాడిన వెపన్​ను ఎందుకు సీజ్ చేయలేదో చెప్పాలన్నారు. ఎమ్మెల్యేల గన్​మెన్ల వెపన్లలో రబ్బరు బుల్లెట్లు మాత్రమే ఉంటాయా అని ప్రశ్నించారు. ఏ చట్ట ప్రకారం మహబూబ్​నగర్​లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గాల్లోకి కాల్పులు జరిపారని ప్రశ్నించారు. బీజేపీ స్టేట్ ఆఫీస్​లో రఘునందన్​ ఆదివారం మీడియాతో మాట్లాడారు.

‘‘మంత్రికి గన్​ లైసెన్స్ ఏమన్నుందా? మంత్రి పేల్చిన తుపాకీని ఫోరెన్సిక్ ల్యాబ్​కు పంపాలె. రిటైర్ అయిన తర్వాత వచ్చే ప్రభుత్వ సలహాదారు పదవి కోసం కాల్పుల ఘటనపై డీజీపీ మహేందర్ రెడ్డి మౌనంగా ఉండటం కరెక్ట్ కాదు. మంత్రి, ఎస్పీపై కేసు పెట్టాలె. లేదంటే హైకోర్టుకు పోతం” అని రఘునందన్ హెచ్చరించారు. ప్రభుత్వ లొసుగులు బయట పెట్టకుండా ఉండేందుకే సీఎం కేసీఆర్ డీజీపీకి సలహాదారు పదవి ఆశ చూపుతున్నారని ఆరోపించారు.