- మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు
కోనరావుపేట, వెలుగు: రాజకీయాలకతీతంగా ఐక్యంగా పనిచేసి, గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు పిలుపునిచ్చారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో తన సొంత గ్రామం నాగారంలో విజయం సాధించిన పాలకవర్గ సభ్యులు బుధవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సర్పంచ్ అప్పల నాగభూషణం, ఉపసర్పంచ్ కీర్తన, వార్డు సభ్యులు గ్రామ అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు.
గ్రామంలోని మౌలిక సదుపాయాలు, రహదారుల పరిస్థితి, శానిటేషన్ నిర్వహణ, తాగునీటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ఆయన సూచించారు. వార్డు సభ్యులు రమేశ్, గంగయ్య, రామచంద్రం, లక్ష్మణ్, ప్రశాంత్, గ్రామస్తులు పాల్గొన్నారు.
