పోలీసులు ప్రజలతో దురుసుగా ప్రవర్తించొద్దు: డీజీపీ

పోలీసులు ప్రజలతో దురుసుగా ప్రవర్తించొద్దు: డీజీపీ
  • నైట్‌‌కర్ఫ్యూ  స్ట్రిక్ట్‌‌గా అమలు చేయాలె
  • ప్రజలతో దురుసుగా ప్రవర్తించొద్దని  పోలీసులకు డీజీపీ ఆదేశాలు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా నైట్‌‌ కర్ఫ్యూ పక్కాగా అమలు చేయాలని డీజీపీ మహేందర్‌‌‌‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జీవోలో తెలిపిన రూల్స్‌‌ ప్రకారం కర్ఫ్యూను ఇంప్లిమెంట్ చేయాలన్నారు. ప్రజలతో దురుసుగా ప్రవర్తించరాదని పోలీసులను ఆదేశించారు. మంగళవారం నుంచి ప్రారంభమైన నైట్‌‌ కర్ఫ్యూ నేపథ్యంలో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్‌‌ నిర్వహించారు. అడిషనల్ డీజీలు గోవింద్ సింగ్,జితేందర్, ఐజీలు నాగిరెడ్డి, స్టీఫెన్ రవీంద్ర,రాజేశ్ కుమార్,ప్రభాకర్ రావు, జోనల్‌‌ ఐజీలు, సీపీలు, ఎస్పీలతో కలసి నైట్‌‌ కర్ఫ్యూ ఇంప్లిమెంటేషన్‌‌పై గైడ్‌‌లైన్స్‌‌ ఇచ్చారు.

ఎమర్జెన్సీ సర్వీసెస్​ తప్ప మిగతావన్నీ..

ఎమర్జెన్సీ సర్వీసెస్‌‌ తప్ప రాత్రి 8 గంటలకే అన్ని వ్యాపార సంస్థలను క్లోజ్‌‌ చేయించాలని ఆదేశించారు. కర్ఫ్యూ టైమ్‌‌లో ప్రజలతో ఫ్రెండ్లీగా వ్యవహరించాలని చెప్పారు. వెహికిల్‌‌ చెకింగ్‌‌ సమయంలో వాహనదారులతో దురుసుగా ప్రవర్తించరాదన్నారు. జీవో ప్రకారం మినహాయింపులున్న వారిని ఐడీ కార్డులతో అనుమతించాలని సూచించారు. గూడ్స్‌‌ వెహికిల్స్‌‌ ట్రావెలింగ్‌‌కు ఎలాంటి ఆటంకాలు సృష్టించవద్దన్నారు. కర్ఫ్యూ రూల్స్‌‌పై ప్రజల్లో అవగాహన పెంచాలని చెప్పారు. మున్సిపల్‌‌ ఎలక్షన్స్‌‌ ప్రచారాలపై ఈసీ ఇచ్చే గైడ్‌‌లైన్స్‌‌ ఫాలో కావాలని ఆదేశించారు.