గ్లోబల్ సమిట్ బందోబస్తును పర్యవేక్షించిన డీజీపీ శివధర్ రెడ్డి

గ్లోబల్ సమిట్ బందోబస్తును పర్యవేక్షించిన డీజీపీ శివధర్ రెడ్డి
  • కొరియా కాన్సుల్ జనరల్‌‌‌‌తో భేటీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: గ్లోబల్ సమిట్ వద్ద  భద్రతా ఏర్పాట్లను డీజీపీ శివధర్ రెడ్డి సోమవారం పర్యవేక్షించారు. స్థానిక అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ముఖ్య అతిథులు, ప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక, వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన హాల్స్‌‌‌‌, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు.

ఈ  సందర్భంగా రిపబ్లిక్ ఆఫ్ కొరియా కాన్సుల్ జనరల్ డాంగ్‌‌‌‌వాన్ యూ బృందంతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్‌‌‌‌లోని కొరియా దేశానికి చెందిన సంస్థలు, కొరియా పౌరుల రక్షణ గురించి చర్చించారు. అడిషనల్ డీజీ(లా అండ్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌) మహేశ్ భగవత్, రాచకొండ  సీపీ సుధీర్ బాబు సహా పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.