
న్యూఢిల్లీ: తమ రాష్ట్రంలో త్వరలో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అమలు చేస్తామని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అనంతరం ధామి మాట్లాడుతూ..ఉత్తరాఖండ్‌లో పర్యటించాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించినట్లు తెలిపారు. జోషిమఠ్‌లో కొండచరియలు విరిగిపడటంతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవడం, చార్ ధామ్ యాత్ర, రాష్ట్రంలో జీఎస్‌టీ వసూళ్లను పెంచడంపై మోదీతో చర్చించినట్లు వివరించారు. యూసీసీ అంశం కూడా చర్చకు వచ్చిందా అని విలేకరులు అడగ్గా.. దాని గురించి తామేమి మాట్లాడుకోలేదని ధామి బదులిచ్చారు. కోడ్‌కు సంబంధించిన పూర్తి ముసాయిదా నివేదిక ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి అందలేదని వెల్లడించారు. అందిన వెంటనే అమలు చేస్తామని.. అలాగని తొందరపాటు నిర్ణయాలు తీసుకోబోమని తెలిపారు.