దండోరా తెలంగాణ రూటెడ్ ఫిల్మ్

దండోరా తెలంగాణ రూటెడ్ ఫిల్మ్

శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ,  బిందు మాధవి ప్రధాన పాత్రల్లో మురళీకాంత్  రూపొందించిన చిత్రం ‘దండోరా’. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించారు.  డిసెంబర్ 25న సినిమా విడుదల కానుంది.  శనివారం టైటిల్ సాంగ్‌‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌లో శివాజీ మాట్లాడుతూ ‘తెలంగాణ రూటెడ్ ఫిల్మ్ ఇది.  ఎమోష‌‌న్స్‌‌తో కూడిన క‌‌మ‌‌ర్షియ‌‌ల్ మూవీ. జ‌‌నాల‌‌కు సందేశాలు, స‌‌ల‌‌హాలు ఇచ్చే ప‌‌రిస్థితిలో ఈవాళ సినిమా లేదు. ఇందులో ఎంట‌‌ర్‌‌టైన్‌‌మెంట్‌‌, ఎమోష‌‌న్స్‌‌, డ్రామా, ఎగ్రెష‌‌న్ అన్నీ ఉన్నాయి. ఫుల్లీ కంటెంట్ లోడెడ్ మూవీ.  ఏ లాంగ్వేజ్‌‌లో  వ‌‌చ్చినా ఈ సినిమా ఆడుతుంద‌‌నేది నా అభిప్రాయం.

ఇందులో న‌‌టించిన అంద‌‌రికీ ఓ ఇంపార్టెన్స్ ఉంటుంది’ అని చెప్పాడు. ఇది చాలా ఇంటెన్స్ మూవీ అని,  కుల వ్యవ‌‌స్థపై  జ‌‌రుగుతున్న చాలా లోతైన విష‌‌యాల‌‌ను హ్యుమ‌‌ర‌‌స్‌‌గా, క‌‌మ‌‌ర్షియ‌‌ల్‌‌గా చూపిస్తున్నారని నటులు నందు, రవికృష్ణ అన్నారు. మ‌‌న‌‌కు జీవితంలో ఎదుర‌‌య్యే అనుభ‌‌వాలే ఈ సినిమా అని దర్శకుడు మురళీకాంత్ చెప్పాడు. టైటిల్ సాంగ్‌‌లో ఏదైతే ఎమోష‌‌న్  ఉందో.. అదే సినిమాలోనూ క‌‌నిపిస్తుందని నిర్మాత రవీంద్ర బెనర్జీ అన్నారు. హీరోయిన్ మణిక, మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్, ఎడిటర్ సృజన, మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ పాల్గొన్నారు.