ఇయ్యాల్టి (డిసెంబర్ 16) నుంచి గుట్టలో ధనుర్మాసోత్సవాలు

ఇయ్యాల్టి (డిసెంబర్ 16) నుంచి గుట్టలో ధనుర్మాసోత్సవాలు
  •      వచ్చే నెల 14 వరకు నిర్వహణ

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మంగళవారం నుంచి ధనుర్మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 16 నుంచి జనవరి 14 వరకు నెల రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం 4.30 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు తిరుప్పావై కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

 ప్రధానాలయ ముఖ మంటపం ఉత్తరం వైపున ఎగువన ఉన్న ప్రత్యేక మండపంలో గోదాదేవిని వేంచేపు చేసి తిరుప్పావై కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ధనుర్మాస ఉత్సవాల్లో ముఖ్య ఘట్టాలైన గోదా కల్యాణాన్ని జనవరి 14న రాత్రి 7 గంటలకు, ఒడిబియ్యం కార్యక్రమాన్ని 15న ఉదయం 11.30 గంటలకు నిర్వహించనున్నారు. అనంతరం నిర్వహించే ప్రత్యేక పూజలతో ధనుర్మాస ఉత్సవాలు ముగియనున్నాయి.