Dhanush-Mrunal Thakur: ధనుష్ - మృణాల్ పెళ్లి? వాలెంటైన్స్ డే రోజే ముహూర్తం ఫిక్స్!

Dhanush-Mrunal Thakur: ధనుష్ - మృణాల్ పెళ్లి? వాలెంటైన్స్ డే రోజే ముహూర్తం ఫిక్స్!

సినీ పరిశ్రమలో ప్రేమలు, బ్రేకప్ లు కొత్తేమీ కాదు . కానీ తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ జంట ఈ ఏడాది వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) రోజు వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి.

ఆ పుకార్లకు బీజం ఎక్కడ పడిందంటే?

ధనుష్, మృణాల్‌ల మధ్య ఏదో నడుస్తోందనే వార్తలు 2025 ఆగస్టులో మొదలయ్యాయి. మృణాల్ ఠాకూర్ నటించిన 'సన్ ఆఫ్ సర్దార్ 2' ప్రీమియర్ షోకు ధనుష్ హాజరు కావడంతో అందరి దృష్టి వీరిపై పడింది. ఆ తర్వాత ధనుష్ నటిస్తున్న 'తేరే ఇష్క్ మే' సినిమా రాప్ అప్ పార్టీలో కూడా మృణాల్ సందడి చేసింది.  ఇది ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో ధనుష్ సోదరీమణులు డాక్టర్ కార్తీక కార్తీక్, విమల గీతలను ఫాలో అవుతుండటం. దీంతో వీరిద్దరి మధ్య బంధం కుటుంబ స్థాయికి చేరుకుంది అని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు.

అతి తక్కువ మంది సమక్షంలోనే పెళ్లి?

సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. ధనుష్ , మృణాల్ ఒక ప్రైవేట్ వేడుకలో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే, ఈ వార్తలపై ఇప్పటివరకు అటు ధనుష్ కానీ, ఇటు మృణాల్ కానీ అధికారికంగా స్పందించలేదు. గతంలో వీరిద్దరి డేటింగ్ గురించి వార్తలు వచ్చినప్పుడు, మృణాల్ ఠాకూర్ వాటిని కొట్టిపారేశారు. ధనుష్ తనకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. కానీ, చిత్ర పరిశ్రమలో మాత్రం వీరిద్దరి ఆలోచనలు, విలువలు ఒకేలా ఉండటంతో చాలా త్వరగా కనెక్ట్ అయ్యారని, ప్రస్తుతం వీరి బంధం చాలా బలంగా ఉందన్న టాక్ వినిపిస్తోంది..

Also Read :  సమంత-రాజ్ నిడిమోరుల తొలి సంక్రాంతి

ఐశ్వర్యతో విడాకులు..

ధనుష్ కు గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో వివాహమైంది. 18 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత, 2022లో వారు విడిపోతున్నట్లు ప్రకటించారు. వీరికి యాత్ర , లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తాజాగా 2024లో వీరి విడాకుల ప్రక్రియ పూర్తయిందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ధనుష్ మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇది నిజమా లేక పుకారా?

మరోవైపు, ధనుష్ సన్నిహిత వర్గాలు ఈ పెళ్లి వార్తలను పూర్తి నిరాధారమైనవి, అబద్ధం అని కొట్టిపారేస్తున్నాయి. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారని, కేవలం స్నేహాన్ని పెళ్లిగా చిత్రీకరిస్తున్నారని వారు వాదిస్తున్నారు. ఏది ఏమైనా, వాలెంటైన్స్ డే దగ్గరపడుతుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. మరి ఈ జంట నిజంగానే పెళ్లి పీటలు ఎక్కుతారా లేక ఇవి కేవలం వెండితెర వెనుక పుకార్లేనా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే..!