శ్రీకారం దర్శకుడితో.. ధనుష్‌‌

శ్రీకారం దర్శకుడితో.. ధనుష్‌‌

‘రఘువరన్ బీ టెక్’ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ ఫాలోయింగ్ పెంచుకున్న తమిళ హీరో ధనుష్.. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ తెలుగు స్ట్రయిట్ సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే తెలుగులో ‘సార్‌‌‌‌’ అనే చిత్రంలో నటించాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ అనే సినిమా తెరకెక్కుతోంది. నాగార్జున మరో హీరోగా నటిస్తున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇది సెట్స్‌‌పై ఉండగానే మరో తెలుగు దర్శకుడికి ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

‘శ్రీకారం’ ఫేమ్ కిషోర్ బి దర్శకత్వంలో ఈ సినిమా ఉండనుందట. ఇప్పటికే ధనుష్‌‌కు స్టోరీ వినిపించగా అతను ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్‌‌ వర్క్స్‌‌ జరుగుతున్నాయి.

అతి త్వరలో ఈ ప్రాజెక్ట్‌‌పై అఫీషియల్‌‌ అనౌన్స్‌‌మెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతు సమస్యలపై ‘శ్రీకారం’ చిత్రం తీసి మెప్పించిన కిషోర్.. ధనుష్‌‌తో ఎలాంటి చిత్రం తీయబోతున్నాడో అనే ఆసక్తి నెలకొంది.