‘కెప్టెన్ మిల్లర్’గా రాబోతున్న ధనుష్

‘కెప్టెన్ మిల్లర్’గా రాబోతున్న ధనుష్

ఇప్పటికే  చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ధనుష్ ఖాతాలో మరో మూవీ చేరింది. రాకీ, సాని కాయిదమ్ వంటి డిఫరెంట్ చిత్రాలు తీసిన అరుణ్ మాథేశ్వరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘కెప్టెన్ మిల్లర్’ అనే మూవీ చేయబోతున్నాడు ధనుష్. ఈ విషయాన్ని నిన్న అఫీషియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అనౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ మోషన్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ధనుష్ బందిపోటు తరహా గెటప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తున్నాడు. ముఖం కనిపించకుండా ఏదో కట్టుకున్నాడు. భుజానికి తుపాకిని తగిలించుకుని బుల్లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దూసుకెళ్తున్నాడు. ఇదొక పీరియడ్ డ్రామా. 1930–40 కాలంలో జరుగుతుంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరుగుతోంది. సత్యజ్యోతి ఫిల్మ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి టీజీ త్యాగరాజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ‘స్క్రిప్ట్ వినగానే నేను, ధనుష్ ఇద్దరం ఎక్సయిటయ్యాం. తను అద్భుతమైన దర్శకుడు. పెద్ద స్కేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ సినిమా తీస్తున్నాం. చాలా మంచి టీమ్ వర్క్ చేయనుంది’ అని చెప్పారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయనున్నట్టు కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్మ్ చేశారు. ఇదిలా ఉంటే ధనుష్ నటించిన  ‘ది గ్రే మేన్’ అనే హాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూవీ జులై 22న నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్ట్రీమింగ్  కానుంది.  అలాగే తమిళంలో తిరుచిత్రబలం, నానే వరువేన్ చిత్రాలతో పాటు తెలుగులో వెంకీ అట్లూరి డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ‘సార్’ మూవీలో నటిస్తున్నాడు.