
అందరూ నడిచే దారిలో కాకుండా కాస్త కొత్తగా ట్రై చేస్తానంటాడు ధనుష్. లవర్ బోయ్‌గా, వయసు మీద పడిన వ్యక్తిగా, గ్యాంగ్‌స్టర్‌గా.. పాత్ర ఏదైతేనేం, అందులో తాను కనబడడు. ఆ క్యారెక్టర్ మాత్రమే కనబడేలా నటిస్తాడు. ముఖ్యంగా మారి, మారి 2 చిత్రాలతో గ్యాంగ్‌స్టర్ సినిమాల్లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు ‘జగమే తంత్రం’లో మరోసారి గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నాడు. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఈ నెల 18న ఓటీటీలో విడుదల కానుంది. నిన్న ట్రైలర్‌ను విడుదల చేశారు. సురులి అనే గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తున్నాడు ధనుష్. కోర మీసం, మాస్ లుక్‌తో మెప్పిస్తున్నాడు. సురులి లండన్ వెళ్లి డాన్‌గా ఎలా మారతాడు, అక్కడి మాఫియాతో ఎలా తలపడతాడు అనే కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కింది. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇంటరెస్టింగ్‌గా ఉన్నాయి. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందించాడు. ధనుష్‌కి ఇది నలభయ్యో సినిమా. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.
What would have been a great theatrical experience coming to Netflix. Nevertheless hope you all enjoy jagame thandhiram and suruli @karthiksubbaraj @Music_Santhosh https://t.co/gCeOdtkcD3
— Dhanush (@dhanushkraja) June 1, 2021