డీ శ్రీనివాస్ హెల్త్ కండీషన్ సీరియస్

డీ శ్రీనివాస్ హెల్త్  కండీషన్ సీరియస్

మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న డీ శ్రీనివాస్ ఆరోగ్యంపై సిటీ న్యూరో సెంటర్ డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. డీ శ్రీనివాస్ పరిస్థితి సీరియస్గా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆయన  శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని.. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు. డీశ్రీనివాస్ కు ఆస్తమా, కిడ్నీ, బీపీ సమస్యలు కూడా ఉన్నాయని తెలిపారు. వయస్సు రీత్యా ఆరోగ్య ఇబ్బందులు తలెత్తాయని హెల్త్ బులిటెన్‌లో డాక్టర్లు పేర్కొన్నారు. 

సెప్టెంబర్ 11వ తేదీన డీ శ్రీనివాస్  తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో  వెంటనే ఆయన్ను  సిటీ న్యూరో ఆస్పత్రికి తరలించారు. ప్రత్యేక వైద్య బృందం డీ శ్రీనివాస్కు చికిత్స అందిస్తోంది.  గతంలోనూ డీఎస్ అస్వస్థతకు గురయ్యారు. కొన్నాళ్ల పాటు ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు.  ఇప్పుడు మరోసారి అస్వస్థతకు గురి అయ్యారు.