
ఈ ఫొటోలో కనిపిస్తున్న యువకుడు, వృద్ధుడు ఒక్కరే. ఈయన పేరు విజయ్‌సింగ్. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ సిటీ నడిబొడ్డులో ఉన్న శివ్చౌక్ వేదికగా ఆయన గత 27 ఏళ్లుగా ధర్నా చేస్తున్నారు. లంచగొండితనం, ల్యాండ్ మాఫియాలపై దాదాపు 3 దశాబ్దాలుగా ఫైట్ చేస్తున్నారు. కబ్జాకోరుల చెర నుంచి ఎన్నో ప్రభుత్వ భూములను ఆయన విడిపించారు. 1996 సంవత్సరం వరకు విజయ్ సింగ్ స్కూల్టీచర్గా పనిచేశారు. అయితే తన ఊరి (షామ్లీ జిల్లా చౌసానా)లోని ప్రభుత్వ భూమిని ల్యాండ్ మాఫియా ఆక్రమించుకోవడాన్ని చూసి సహించలేకపోయారు. భూకబ్జాలపై పోరాడేందుకు టీచర్ జాబ్ వదిలేసి 1996 ఫిబ్రవరి 26న ధర్నాను ప్రారంభించారు.