వేతనాలను 18 వేలకు పెంచాలి

వేతనాలను 18 వేలకు పెంచాలి
  • ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆఫీస్ వద్ద ఆశా వర్కర్ల ధర్నా

హైదరాబాద్, వెలుగు: తమ వేతనాలను రూ.18 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆఫీసు ఎదుట ఆశా వర్కర్లు ధర్నా చేశారు. వేతనాల పెంపుపై కాంగ్రెస్ తమకు హామీ ఇచ్చిందని వారు గుర్తు చేశారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా ఆశా వర్కర్లకు ఇస్తున్న పారితోషికాలను రూ.18 వేలకు పెంచి, ఫిక్స్‌‌‌‌డ్‌‌ వేతనం నిర్ణయించాలని తెలిపారు. శనివారం  బీఆర్‌‌‌‌టీయూ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు ఆందోళన చేపట్టారు. 

గతంలో ఇచ్చినట్టు ఆశాలకు ప్రతినెలా 2న పారితోషికాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆశాలకు ఇన్సూరెన్స్ రూ.50 లక్షలు చెల్లిస్తూ సర్క్యులర్ జారీ చేయాలని పేర్కొన్నారు. రిటైర్ మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు చెల్లించాలన్నారు. 2021 జులై నుంచి డిసెంబర్ వరకు 6 నెలల పీఆర్సీ అరియర్స్ వెంటనే చెల్లించాలని వివరించారు.