పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ధర్నా

పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ధర్నా

పెద్దపల్లి, వెలుగు: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని పెద్దపల్లి జిల్లా మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డే మీల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్కర్స్​ డిమాండ్​ చేశారు. గురువారం పెద్దపల్లి కలెక్టరేట్​ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలన్నారు.

 అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ సెంటర్లకు అందించినట్లుగానే గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నిత్యావసరాలు, సరుకులు మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డే మీల్స్ స్కీముకు అమలుచేయాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ మిడ్ డే మీల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్కర్స్​ యూనియన్​ జిల్లా ప్రధాన కార్యదర్శి పూసల రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌​, కార్మికులు రాజేశ్వరి, కళావతి, లక్ష్మీ, వరలక్ష్మి, అంజు పాల్గొన్నారు.