
కామేపల్లి వెలుగు మండలంలోని గరిడేపల్లి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఆ గ్రామ ప్రజలు గ్రామంలోని బొడ్రా సెంటర్లో ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెల రోజుల నుండి గ్రామంలో సక్రమంగా తాగునీరు సరఫరా సరిగా లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.
మిషన్ భగీరథ నీటి సరఫరాలోని ఇబ్బందులను అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పేరుకే గ్రామంలో మిషన్ భగీరథ పైపులైన్ ఉందని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి తమ గ్రామానికి మంచినీరు అందించాలని వారు డిమాండ్ చేశారు.