
గద్వాల, వెలుగు : గద్వాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. ధరూర్ ఎంపీపీ నజీమున్నీసా బేగం, మైనార్టీ నాయకుడు షాకీర్ మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం హైదరాబాద్ లో పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారికి పీసీసీ చీఫ్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించాడు. వారితో పాటు బీజేపీ అధికార ప్రతినిధి నాగేందర్ యాదవ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.