బీమా రంగంలో ఎఫ్డీఐని 32 శాతమే ఉంచాలి : బంగి రంగారావు

బీమా రంగంలో ఎఫ్డీఐని 32 శాతమే ఉంచాలి : బంగి రంగారావు
  • సంఘం ప్రధాన కార్యదర్శి బంగి రంగారావు

గద్వాల టౌన్, వెలుగు : బీమా రంగంలో వినియోగిస్తున్న మొత్తం మూలధనంలో ఎఫ్ డీఐ వాటాను 32 శాతమే ఉంచాలని ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి బంగి రంగారావు డిమాండ్ చేశారు. సోమవారం ఎల్ఐసీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం 2025 డిసెంబర్ 12న ప్రో క్యాపిటల్ ఆర్థిక సంస్కరణలకు ఆమోదం తెలిపిందన్నారు. 

బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్​డీఐ) పరిమితిని 100 శాతం పెంచడం బీమా చట్టాల సవరణ బిల్లును ఆమోదం తెలిపారని చెప్పారు. 1999 ఐఆర్డీఏ బిల్లును ఆమోదించడం ద్వారా బీమా రంగాన్ని జాతీయకరణ నుంచి విముక్తం చేశారన్నారు. అప్పటినుంచి విదేశీ భాగ్యస్వాములతో కూడిన అనేక బీమా సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని వివరించారు. 

ఎఫ్​డీఐ పరిమితిని పెంచడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకే కాకుండా దేశీయ బీమా సంస్థలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు ఉంటాయని తెలిపారు. ఆ నిర్ణయాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.