రాణించడమే నా పని..ఎంపిక నా చేతుల్లో లేదు

రాణించడమే నా పని..ఎంపిక నా చేతుల్లో లేదు

ఆసియాకప్ టీ20కి తనను ఎంపిక చేయకపోవడంపై టీమిండియా ఓపెనర్ శిఖర ధావన్ స్పందించాడు. టీ20 ఫార్మాట్కు తనను ఎందుకు సెలక్ట్ చేయడం లేదో అర్థం కావడం లేదని చెప్పాడు. తనను ఎంపిక చేయకపోవడానికి ఏమైనా కారణాలు ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. దాని గురించి పెద్దగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోవాలనుకోవడం లేదన్నాడు. తాను  చాలా కాలంగా టీ20 జట్టులో ఆడటం లేదని..తనను ఏ ఫార్మాట్లో  ఎంపిక చేస్తారో కూడా  తెలియదని చెప్పుకొచ్చాడు.

రాణించడమే నా పని..


వన్డే అయినా..టెస్టు అయినా..టీ20 అయినా..తనకు అవకాశం వస్తే దానిని సద్వినియోగం చేసుకోవడమే తన పని అని ధావన్ అన్నాడు. దేశవాళీ క్రికెట్ అయినా..టీమిండియా అయినా..స్థానం దక్కితే బాగా రాణించాలని అనుకుంటానని తెలిపాడు. అదొక్కటే తన చేతుల్లో ఉందని..మిగతాది తన హ్యాండోవర్లో లేదన్నాడు. 

ఒక్క ఇన్నింగ్స్ చాలు..


విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్లేయర్ అని ధావన్ కొనియాడాడు. అతని ఫాం గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పాడు. కోహ్లీ పుంజుకోవడానికి ఒక ఇన్నింగ్స్ దూరంలో ఉన్నాడని..త్వరలోనే అతను ఫాంలోకి వస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. 

ధావన్ చివరి సారిగా 2021లో టీ20 ఆడాడు. 2021లో శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత టీ20 జట్టుకు ధావన్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఆ తర్వాత ధావన్ టీ20లకు ఎంపిక కాలేదు.  2011లో విండీస్పై టీ20ల్లో ఎంట్రీ ఇచ్చిన ధావన్..ఇప్పటి వరకు 68 టీ20లు ఆడాడు. ఇందులో ఒక వెయ్యి 759 పరుగులు సాధించాడు. 50 హాఫ్ సెంచరీలున్నాయి. అటు ఐపీఎల్లో 206 మ్యాచుల్లో 6243 రన్స్ కొట్టాడు. ఇందులో రెండు సెంచరీలు, 47 అర్థసెంచరీలున్నాయి.