ధోని కెరీర్ ముగిసినట్టేనా? బీసీసీఐ కాంట్రాక్ట్ నుంచి ధోనీ ఔట్!

ధోని కెరీర్ ముగిసినట్టేనా? బీసీసీఐ కాంట్రాక్ట్ నుంచి ధోనీ ఔట్!

టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీకి బీసీసీఐ ఝలక్ ఇచ్చింది. ధోని పేరు లేకుండానే 2019-2020 భారత ఆటగాళ్ల కాంట్రాక్ట్ జాబితాను రిలీజ్ చేసింది. మొత్తం నాలుగు కేటగిరీలుగా ఆటగాళ్లు ఉన్నారు. ఈ నాలుగు కేటగిరిలో మొత్తం 27 మంది ఆటగాళ్లు ఉన్నారు.  బిసిసిఐ 2019 అక్టోబర్ నుంచి 2020 సెప్టెంబర్ వరకు ఈ కాంట్రాక్ట్  ఉండనుంది. గతంలో ధోని ఎ కేటగిరీలో ఉండేవాడు. కేటగిరి ఎ + ఆటగాళ్లకు రూ .7 కోట్లు, కేటగిరి ఏ ఆటగాళ్లకు రూ .5 కోట్లు, కేటగిరి బి ఆటగాళ్లకు రూ .3 కోట్లు,కేటగిరి సి ఆటగాళ్లకు రూ.1 కోటి ఇవ్వనున్నారు.  ధోనీ రిటైర్మెంట్ పై ఊహాగానాల నేపథ్యంలో  బీసీసీఐ కాంట్రాక్ట్ లిస్టులో ధోని పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. 

కేటగిరి ఎ+

లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా కేటగిరి  ఉన్నారు. కేటగిరి ఏ లో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, చేతేశ్వర్ పూజారా, అజింక్య రహానె, కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, మహ్మద్ షమీ, ఇశాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్,రిషబ్ పంత్

కేటగిరి బి

వృద్దిమాన్ సాహా, ఉమేష్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, హార్దిక్ పాండ్యా, మయాంక్ అగర్వాల్.

కేటగిరి సి

కేదార్ జాదవ్, నవదీప్ సైని, దీపక్ చాహర్, మనీష్ పాండే, హనుమా విహారీ, శార్దుల్ ఠాకూర్, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్.