ఢిల్లీ: ఈ సీజన్లో ఒక్క మ్యాచ్‌కూడా ఆడని మహేంద్ర సింగ్ధోని మే 5న (మంగళవారం) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌కు కూడా దూరం కానున్నాడు. సోమవారం చెన్నై సూపర్ కింగ్స్ శిబిరం నుంచి ఈ వార్త బయటకు వచ్చింది. ధోని ఈ మ్యాచ్‌కోసం జట్టుతో ఢిల్లీకి ప్రయాణించలేదు. కాలిపిక్క గాయం కారణంగా ఆయన ఇంకా కోలుకుంటూనే ఉన్నారని, ప్రస్తుతం ఆయన జట్టుతో లేరని సీఎస్కే బౌలింగ్ కన్సల్టెంట్ ఎరిక్ సిమన్స్ తెలిపారు.
“ధోనీకి సంబంధించిన అప్‌డేట్ ఇవ్వడం నా స్థాయికి మించిన విషయం. ఆయన ప్రస్తుతం మాతో లేరు కానీ గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నారు. తాను ఎప్పుడు ఆడాలో, ఎప్పుడు సిద్ధంగా ఉంటారో ఆయనకు బాగా తెలుసు. సిద్ధంగా ఉన్నప్పుడే ఆయన బరిలోకి దిగుతారు” అని సిమన్స్ పేర్కొన్నారు. గాయం తీవ్రత పెరగడంతో జట్టు మేనేజ్‌మెంట్ అతనికి విశ్రాంతినివ్వాలని నిర్ణయించింది. టోర్నమెంట్ కీలక దశకు చేరుకుంటున్న నేపథ్యంలో, ధోని ఫిట్‌నెస్‌ను దృష్టిలో పెట్టుకొని తదుపరి మ్యాచ్‌లో రిస్క్ తీసుకోవద్దని డాక్టర్లు సూచించారు.
