హైదరాబాద్, వెలుగు: క్రికెట్ లెజెండ్, చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనీ టీమ్‌తో కలిసి హైదరాబాద్ చేరుకున్నాడు. శనివారం ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సీఎస్కే పోటీ పడనుంది. ఈ పోరు కోసం టీమ్ గురువారం సిటీకి చేరగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. చాలా కాలం తర్వాత ధోనీ హైదరాబాద్ రావడంతో ఎయిర్‌పోర్ట్ బయట అభిమానుల కోలాహలం నెలకొంది.
భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్ అతడిని చూడగానే ధోనీ.. ధోనీ అంటూ అభిమానులు చేసిన నినాదాలతో ఎయిర్‌పోర్ట్ పరిసరాలు మారు మోగిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ధోనీ భార్య సాక్షి ఇన్‌స్టాలో షేర్ చేసింది. అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ టీమ్ బస్సులో మహీతో పాటు చెన్నై ప్లేయర్లు హోటల్ చేరుకున్నారు.

