RCB vs CSK: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ధోనీ.. స్టార్ బౌలర్‏ను పక్కనపెట్టిన ఆర్సీబీ

RCB vs CSK: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ధోనీ.. స్టార్ బౌలర్‏ను పక్కనపెట్టిన ఆర్సీబీ

ఐపీఎల్‎లో మరో ఇంట్రెస్టింగ్ పోరుకు సమయం ఆసన్నమైంది. టోర్నీలో మోస్ట్ హాట్ ఫేవరెట్ టీమ్స్ ఆర్సీబీ, సీఎస్కే తలపడబోతున్నాయి. బెంగుళూరులోని చినస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‎లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోని  బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేయనుంది. చెన్నై జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతుండగా.. ఆర్సీబీ టీమ్‎లో ఒక మార్పు చేసింది. 

మంచి ఫామ్‎లో ఉన్న జోష్ హాజిల్ వుడ్‎ను పక్కన పెట్టి అతడి స్థానంలో లుంగి ఎంగిడిని జట్టులోకి తీసుకుంది. ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తోన్న ఆర్సీబీ సొంత గడ్డపై చెన్నైను మట్టి కరిపించి పాయింట్ల పట్టికలో మూడో ప్లేస్ నుంచి అగ్రస్థానానికి ఎగబాకాలని భావిస్తోంది. పేలవ ప్రదర్శనతో ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన సేఎస్కే.. ఆర్సీబీపై గెలిచి కనీసం పరువు కాపాడుకోవాలని ప్రయత్నిస్తోంది. 

జట్లు:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(సి), జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, లుంగీ ఎన్గిడి, యశ్ దయాల్

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): షేక్ రషీద్, ఆయుష్ మ్హత్రే, సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, దీపక్ హుడా, MS ధోని(w/c), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మతీషా పతిరానా