ఆమ్రపాలి గ్రూప్‌పై సుప్రీంలో ధోని పిటిషన్‌

ఆమ్రపాలి గ్రూప్‌పై సుప్రీంలో ధోని పిటిషన్‌

భారత జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని తనకు రావాల్సిన బకాయిలను ఇప్పించాల్సిందిగా సుప్రీంను ఆశ్రయించారు. ఇందుకుగాను ఆమ్రపాలి గ్రూప్‌ గతంలో తనను బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకున్నారని ,తనకు రావాల్సిన రూ. 40 కోట్ల బకాయిలు చెల్లించాల్సిందిగా ఆ సంస్థను ఆదేశించాలని కోరుతూ ధోని సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

2009లో తనను ఆమ్రపాలి గ్రూప్‌తో బ్రాండ్‌ అంబాసిడర్‌గా అనేక అగ్రిమెంట్లు కుదుర్చుకున్నానని, 2016 దాకా ఈ సంస్థకు ప్రచారకర్తగా ఉన్నట్లు ధోని అన్నారు. అయితే కొనుగోలు దారులను మోసం చేసిన కేసులో ఆమ్రపాలి గ్రూప్‌పై కేసులు నమోదయ్యాయి, దీంతో మోసపూరిత కంపెనీకి ప్రచారం చేస్తున్నారని సోషల్‌ మీడియాలో విమర్శలు రావడంతో ధోని…. ఆమ్రపాలి గ్రూప్‌తో తన ఒప్పందాలను రద్దు చేసుకున్నాడు. గతంలో తన సేవలను వాడుకుని తనకు డబ్బు చెల్లించలేదని ధోని పిటిషన్‌లో తెలిపారు. తక్షణమే చెల్లించాలని ఆదేశాలివ్వాలని కోరారు ధోని.