ధురంధర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌,‌‌‌‌ గ్లింప్స్‌‌‌‌ రిలీజ్..

ధురంధర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌,‌‌‌‌ గ్లింప్స్‌‌‌‌ రిలీజ్..

బాలీవుడ్ స్టార్ ర‌‌‌‌ణ్‌‌‌‌వీర్‌‌‌‌ సింగ్  హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘ధురంధర్’. గ్యాంగ్‌‌‌‌స్టర్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో సారా అర్జున్ హీరోయిన్‌గా నటిస్తోంది.  సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. జియో స్టూడియోస్ సమర్పణలో జ్యోతి దేశ్‌‌‌‌పాండే, లోకేష్ ధర్  నిర్మిస్తున్నారు. ఆదివారం రణ్‌‌‌‌వీర్ సింగ్ బర్త్‌‌‌‌డే సందర్భంగా  ఈ మూవీ  ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌,‌‌‌‌ గ్లింప్స్‌‌‌‌ను రిలీజ్ చేశారు. 

ఇందులోని పాత్రలను పరిచయం చేస్తూ సాగిన వీడియో సినిమాపై ఆసక్తిని పెంచింది. రణ్‌‌‌‌వీర్ సింగ్ మాస్‌‌‌‌ అప్పీల్‌‌‌‌ ఉన్న  డిఫరెంట్ గెటప్‌‌‌‌లో ఆకట్టుకున్నాడు. కంప్లీట్ యాక్షన్ సీన్స్‌‌‌‌తో ఈ వీడియోను కట్ చేశారు. శాశ్వత్ సచ్‌‌‌‌దేవ్ అందించిన బ్యాక్‌‌‌‌గ్రౌండ్ స్కోరు ఆకట్టుకుంది. డిసెంబర్ 5న సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.