డయాబెటిక్ కేర్.. గ్లూకోజ్​ అసలు కారణం !

  డయాబెటిక్ కేర్..  గ్లూకోజ్​  అసలు  కారణం !

డయాబెటిస్​ను వైద్య పరిభాషలో డయాబెటిస్​  మెలిటస్​ అంటారు. ఇది మెటబాలిక్​ డిసీజ్. దీన్ని సరిగ్గా మేనేజ్​ చేయకపోతే ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. శరీరం బ్లడ్​ షుగర్​ను వాడుకోవడం మీద దీని ప్రభావం ఉంటుంది.శరీరంలోని కండరాలు, త్వచాల్లో ఉండే కణాలకు ప్రధాన ఎనర్జీ సోర్స్​ గ్లూకోజ్​. అలాగే బ్రెయిన్​కి మెయిన్​ ఇంధనం కూడా ఇదే.

 డయాబెటిస్​లో టైప్​1, టైప్​2, జెస్టేషనల్​, ప్రి–డయాబెటిస్​​ అని రకాలు ఉంటాయి.​ అది ఏ రకం అయినా కూడా రక్తంలో చక్కెర మోతాదులో మాత్రం తేడా వస్తుంది. రక్తంలో చక్కెర ఎక్కువగా ఉండడం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీర్ఘకాలిక డయాబెటిక్​ కండిషన్లలో టైప్​1, టైప్​2 డయాబెటిస్​ ఉంటాయి. 

అయితే డయాబెటిస్​ను రివర్స్ చేయడం అనేది మాత్రం ప్రి–డయాబెటిస్​, జెస్టేషనల్​ డయాబెటిస్​లో వీలవుతుంది. ప్రి–డయాబెటిస్​లో రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి. అంతేకానీ డయాబెటిస్​ బారిన పడ్డారని చెప్పే స్థాయిలో బ్లడ్​ షుగర్​ లెవల్స్​ ఉండవు. ప్రి–డయాబెటిస్​ ఉంటే అది డయాబెటిస్​కు దారి తీసే అవకాశం ఉందనే ముందస్తు హెచ్చరిక ఇది. ఇలాంటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఏ సమస్యా ఉండదు. ప్రెగ్నెంట్​గా ఉన్నప్పుడు కొందరిలో జెస్టేషనల్​ డయాబెటిస్ వస్తుంది. ప్రసవం అయ్యాక ఇది చాలామందిలో పోతుంది. రక్తంలో చక్కెర ఎంత ఎక్కువగా ఉందనే దాన్ని బట్టి డయాబెటిస్​ లక్షణాలు ఉంటాయి. కొందరిలో ప్రత్యేకించి ప్రి, జెస్టేషనల్​ డయాబెటిస్​ లేదా టైప్​2 డయాబెటిస్​ ఉన్న వాళ్లలో లక్షణాలు కనిపించవు. టైప్​1 డయాబెటిస్​లో అయితే లక్షణాలు వెంటనే కనిపిస్తాయి.