
మధుమేహం(Diabetes) అంటే కేవలం షుగర్, బరువు లేదా ఎక్సయిజ్ గురించే అనుకుంటూంటం కదా ? కానీ కొత్త అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే నిశ్శబ్దం, ఒంటరితనం కూడా మధుమేహానికి కారణం కావొచ్చు. అవును, ఎక్కువ కాలం ఒంటరిగా, నిశ్శబ్దంగా ఉండటం వల్ల కూడా ఛాతీలో నొప్పిలాంటివి రావొచ్చు. అంటే మన మానసిక ఆరోగ్యం(mental health) మన శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది అని.
సాధారణంగా ఎక్కువగా స్నాక్స్ తినడం, ఎక్కువసేపు కూర్చోవడం, లేదా తక్కువగా నడవడం లేదా మానేయడం వంటివి కూడా డయాబెటిస్‌కు కారణాలని అనుకుంటాం ? కానీ ENDO 2025లో చెప్పిన కొత్త అధ్యయనం ప్రకారం ఒంటరితనం కూడా మీ డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందట.
కెనడాలోని వెస్ట్రన్ అంటారియో యూనివర్సిటీ పరిశోధకులు 50 ఏళ్లు దాటిన 4వేల మంది అమెరికన్లపై ఓ పరిశోధన చేశారు. వీరికి తెలిసిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అందరికి దూరంగా ఒంటరిగా ఉంటున్నామని భావించే వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం 34 శాతం ఎక్కువ ఉందట.
సాధారణంగా ఒంటరితనం అంటే ఫ్రెండ్స్ లేకపోవడం లేదా ఒంటరిగా జీవించడం అని అనుకుంటాం. కానీ పరిశోధకులు ఇటీవల ఒక ఆసక్తికరమైన విషయాన్ని కనుగొన్నారు. మీరు ఎంతమందితో కలిసి ఉంటున్నారో దానికీ మీ షుగర్ లెవెల్స్ (HbA1c) కంట్రోల్‌కీ మధ్య ఓ సంబంధం ఉందట. ఇప్పటికే షుగర్ వ్యాధి ఉన్నవారిలో షుగర్‌ను కంట్రోల్ చేసుకోవడానికి 75 శాతం ఎక్కువ కష్టపడతారట.
ఇలా జరగడానికి కారణం, భావోద్వేగాల మధ్య దూరం నిద్రను ప్రభావితం చేస్తుంది, వాపును పెంచుతుంది, రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది మరియు సక్రమంగా తినడానికి దారితీస్తుంది. ఇవన్నీ రక్తంలో చక్కెర స్థాయిలపై వినాశనం కలిగిస్తాయి. మరో మాటలో చెప్పాలంటే, ఒంటరితనం భావోద్వేగంగా ఉన్నంత జీవక్రియాత్మకంగా ఉంటుంది.
ఒంటరితనం అనేది నిద్ర లేకుండ చేస్తుంది, రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది, సరిగ్గా తినకపోవడానికి కారణమవుతుంది. ఇవన్నీ రక్తంలో చక్కెర స్థాయిలను ప్రాభవం చేస్తాయి. ఈ అధ్యయనం ప్రభావాన్ని వివరిస్తూ అప్పుడపుడు ఒంటరిగా ఉన్నవారికి డయాబెటిస్ వచ్చే అవకాశం 36 శాతం ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఒంటరిగా ఉన్నవారికే ఇంకా ఎక్కువగా ప్రమాదం ఉంటుందట.
ALSO READ : యువతలో పెరుగుతున్న కొత్త రకం క్యాన్సర్: ఈ లక్షణాలు కనిపిస్తే డాక్టరుని కలవాల్సిందే..!
డయాబెటిస్ తగ్గించుకోవడానికి కొన్ని టిప్స్ :
*మీ లంచ్ లేదా డిన్నర్ రోజుకు ఒకసారి అయినా ఫ్యామిలీ, ఫ్రండ్స్ లేదా ఇతరులతో కలిసి చేయడం బెస్ట్.
* మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ లేదా కొలీగ్స్ తో కాల్ చేసి మాట్లాడడం కూడా డయాబెటిస్ తగ్గించడానికి సహాయపడుతుంది.
* యోగా క్లాస్ లేదా వీకెండ్ మీటింగ్స్ కూడా ఉపయోగపడుతుంది.
* కొత్త వంటకం చేయడంలాంటివి మీ మెదడును ఉత్తేజపరుస్తాయి, ఇంకా మిమ్మల్ని ఇతరులతో కనెక్ట్ అయ్యేల చేస్తాయి.
* కుక్కలు, పిల్లుల పెంపకం అంటే అవి మాట్లాడలేవు కానీ అవి వింటాయి, మీకు దగ్గర ఎప్పుడు తోడుగా మీతో ఉంటాయి.
* మీకు నచ్చిన పని చేయడం అంటే తోటపని, పెయింటింగ్స్ వేయడం, పాత పాటలు పాడటం. ఇవన్నీ మీ మనసుకు శాంతిని చేకూరుస్తాయి.
* చిన్న చిన్న పనులు చేయడం అంటే మీ టీ మీరే పెట్టుకోవడం, మీ బట్టలు మిరే మడతపెట్టడం, యోగా చేయడం లేదా మీకు ఇష్టమైన టీవీ ప్రోగ్రామ్స్, సినిమాలు చూడడం ఈ అలవాట్లు ఒక సంతృప్తిని ఇస్తాయి.