పబ్ జీతో వేలు సంపాదిస్తున్నారు

పబ్ జీతో వేలు సంపాదిస్తున్నారు

సమయం రాత్రి తొమ్మిదిన్నర. హడావుడిగా వచ్చి కంప్యూటర్ ముందు కూర్చున్నాడు రిషబ్ కరణ్ వాల్. పబ్ జీ ఆడటం మొదలుపెట్టాడు. గేమ్ లో అతని పేరు ‘‘రకా’’. గంటలు గడుస్తున్నా లేవడంలేదు. చివరకు తెల్లవారుజామున రెండింటికి ఆడటం ఆపేశాడు. లైట్స్ ఆఫ్ చేసి పడుకున్నాడు. ఉదయాన్నే లేచి రెడీ అయి ఆఫీస్ కు వెళ్లిపోయాడు. వారంలో ఆరు రోజులు ఇదే జరుగుతుం ది. రాత్రి తొమ్మిదన్నరయితే చాలు రిషబ్ లోని రకా మేల్కొంటాడు. ఏదో ఊసుపోకో, గేమ్ కు అడిక్ట్ అయిపోయో అతనీ పని చేయడం లేదు. ఆట ఆడి వేలకు వేలు సంపాదిస్తున్నాడు. తాను ఆడే గేమ్ వారంలో మూడు రోజుల పాటు యూట్యూబ్ లో లైవ్ స్ట్రీమ్ చేస్తాడు రిషబ్. దీన్ని వెయ్యి మందికి పైగా రోజూ వీక్షిస్తున్నారు. ఎలా ఆడుతున్నారన్న దానిపై కామెంట్లు ,ఓ లెవల్ ను కంప్లీట్ చేస్తే శుభాకాం క్షలు చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు డబ్బు ఇస్తున్నారు. ఇలా పబ్ జీ మాత్రమే కాదు ఫోర్ట్ నైట్, కౌంటర్ స్ట్రైక్, లీగ్ ఆఫ్ లెజెండ్స్ తదితర గేమ్స్ తో చాలా మంది గేమర్లు డబ్బు సంపాదిస్తున్నారు.

స్ట్రీమర్ ఆఫ్ ది ఇయర్ ఇండియా గేమింగ్ అవార్డ్స్–2018లో రిషబ్ కరణ్ వాల్ ‘‘స్ట్రీమర్ ఆఫ్ ది ఇయర్” అవార్డు గెల్చుకున్నారు. రిషబ్ ఆన్ లైన్ గేమ్స్ ఆడటం 2016లో మొదలుపెట్టారు. దీని ద్వారా డబ్బు సంపాదిస్తానని కలలో కూడా అనుకోలేదని అవార్డు తీసుకున్న తర్వాత రిషబ్ చెప్పా డు. నెలకు 50 వేల సంపాదన గేమ్స్ కోసం వేలకు వేలు ఖర్చు చేస్తుంటే రిషబ్ ను అంతా పిచ్చొడా.. అన్నట్లు  సేవారట. కొందరైతే మీ నాన్న డబ్బు ఎందుకు అట్లా తగలబెడుతున్నావని తిట్టిపోశారట. కానీ ఇవేమీ ఆయన్ను గేమ్స్ నుంచి దూరం చేయలేదు. కొద్ది రోజులకు స్ట్రీమింగ్ ద్వారా వెయ్యి రూపాయలు వచ్చాయి. ఇప్పుడు నెలకు యూట్యూబ్ యాడ్స్ రెవెన్యూ, చానెల్ సబ్ స్క్రిప్షన్స్, బ్రాండ్ స్పాన్సర్ షిప్స్, వీక్షకుల డొనే షన్లు అన్నీ కలిపి రూ. 50 వేల దాకా వస్తున్నాయి. కొందరు ‘ట్విచ్’ద్వారా కూడా స్ట్రీమ్ చేసి డబ్బు ఆర్జిస్తున్నారు. బూమ్ బూమ్ గేమింగ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఆరోగ్యం పై ప్రభావం,యాడిక్ట్ అయ్యే చాన్సులు ఉన్నా ఇండియాలో గేమ్స్ కు బూమ్ తగ్గడం లేదు. రోజూ కొత్త యూజర్లు, కొత్త స్టార్లు ఈ మార్కె ట్లో దూసుకొస్తున్నారు. 2022 కల్లా ఇండియా ఆన్ లైన్ గేమింగ్ మార్కె ట్ 801 మిలియన్ డాలర్లకు పెరుగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, టెక్ సీ అంచనా వేశాయి.