MS Dhoni: ఐపీఎల్ 2026 (IPL 2026) ప్లేఆఫ్స్ రేసు ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్న వేళ, సోషల్ మీడియాలో ఓల్డ్ న్యూస్ ఒకటి ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ ‘కెప్టెన్ కూల్’గా పేరు తెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni).. ఒక మ్యాచ్ ఓటమి తర్వాత తీవ్ర ఆగ్రహంతో డ్రెస్సింగ్ రూమ్ వెలుపల ఉన్న టీవీ స్క్రీన్‌ను పగలగొట్టాడంటూ టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట మారుమోగిపోతున్నాయి.
మే 18, 2024న ఏం జరిగింది?:
టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఒక ప్రముఖ మీడియా ఛానెల్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. 2024 ఐపీఎల్ సీజన్ లో డ్రెస్సింగ్ రూమ్ లో జరిగిన ఒక సీక్రెట్‌ను బయటపెట్టాడు. 2024 మే 18న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఘోర పరాజయాన్ని చవిచూసి ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది.
హర్భజన్ సింగ్ హాట్ కామెంట్స్:
ఆర్సీబీ అద్భుత విజయంతో ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై కావడంతో విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ సహా ఆ జట్టు ప్లేయర్స్ మైదానంలో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. మరోవైపు ధోనితో పాటు సీఎస్కే ఆటగాళ్లు పోస్ట్-మ్యాచ్ హ్యాండ్‌షేక్స్ (కరచాలనం) కోసం లైన్ లో నిలబడ్డారు. కానీ ఆర్సీబీ సంబరాల వలన చాలా ఆలస్యం కావడంతో ధోనికి విపరీతమైన కోపం వచ్చేసింది. దాంతో హ్యాండ్‌షేక్ చేయకుండానే అతడు మైదానం వీడి పెవిలియన్ వైపు వెళ్ళిపోయాడు. ఆ తీవ్ర నిరాశలో డ్రెస్సింగ్ రూమ్ బయట ఉన్న ఒక టీవీ స్క్రీన్‌ను ధోని గట్టిగా గుద్ది పగలగొట్టాడని హర్భజన్ సింగ్ వెల్లడించాడు.
►ALSO READ | ముంబై టాస్ విన్.. రాజస్థాన్‌తో కీలక పోరులో ఫీల్డింగ్ తీసుకున్న హార్దిక్ పాండ్యా
కూల్ కెప్టెన్ ఇమేజ్‌కు భిన్నంగా..
ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రశాంతమైన మైండ్ సెట్ ఉన్న ఆటగాడిగా ధోనికి పేరుంది. ఎంతటి ఒత్తిడి సమయాల్లోనైనా, హార్ట్ బ్రేకింగ్ ఓటములనైనా ధోని చిరునవ్వుతో స్వీకరిస్తాడు. అలాంటి కెప్టెన్ కూల్ నిజంగానే అంతలా సహనం కోల్పోయాడా? అంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హర్భజన్ చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం డ్రెస్సింగ్ రూమ్ రూమర్లేనా లేక నిజంగానే జరిగిందా అనే సస్పెన్స్ అభిమానుల్లో నెలకొంది.
🚨 HARBHAJAN SINGH on Sports Yaari :
— The Cricket View (@TheCricketView) May 24, 2026
“MS Dhoni Broke the TV in anger after losing to RCB on 18th May in the dressing Room.” 🤯pic.twitter.com/mMhk69dbv7
