Naga Chaitanya: శోభితతో నిశ్చితార్థం ముందు..చై, సమంతతో ఉన్న ఫొటోస్ డిలేట్ చేశాడా?..క్లారిటీ

Naga Chaitanya: శోభితతో నిశ్చితార్థం ముందు..చై, సమంతతో ఉన్న ఫొటోస్ డిలేట్ చేశాడా?..క్లారిటీ

నాగ చైతన్య(Naga Chaitanya), శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) నిశ్చితార్థం ఎట్టకేలకు సీక్రెట్గా జరిగిపోయింది. చివరి వరకూ ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడిన అక్కినేని ఫ్యామిలీ..వీరి ఎంగేజ్‌మెంట్ తో ఏకంగా ఫొటోలనే రిలీజ్ చేసింది. దీంతో చై జీవితంలో సమంత ఛాప్టర్ పూర్తిగా క్లోజ్ అయింది.

ఈ నేపథ్యంలో చై తన సోషల్ మీడియా నుంచి సమంత (Samantha) ఫోటోలు డిలీట్ చేశాడా? అనే దానిపై చర్చ జరుగుతుంది. ఎందుకంటే, నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం వార్తా రాగానే చై ఫ్యాన్స్ తన ఇంస్టాగ్రామ్ తరువుగా చెక్ చేసారు.అందులో మాజీ భార్య సమంతతో ఉన్న కొన్ని ఫొటోస్ తొలగించబడ్డాయి.ప్రస్తుతం చై ఇంస్టాగ్రామ్లో సామ్తో కలిసి నటించిన మజిలీ సినిమా పోస్టర్ మాత్రమే ఉండటం గమనార్హం. దీంతో నాగ చైతన్య తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి ముందు కొత్త డెసిషన్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

నాగ చైతన్య అక్టోబర్ 2017లో సమంతతో వివాహం కాగా..వారిరువురు 2 అక్టోబరు, 2021న వ్యక్తిగత కారణాలతో విడిపోతున్నట్టు సోషల్ మీడియా  వేదికగా ప్రకటించారు. ఈ విషయాన్ని నాగ చైతన్య  ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. మరోవైపు సమంత సైతం నాగచైతన్యతో విడిపోతున్నట్లు ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేసింది.