సమంత దగ్గర డబ్బులు లేవా.. చికిత్స కోసం హీరో దగ్గర అప్పు చేసిందా?

సమంత దగ్గర డబ్బులు లేవా.. చికిత్స కోసం హీరో దగ్గర అప్పు చేసిందా?

సమంత.. సమంత.. సమంత(Samantha).. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్.. టాప్ రెమ్యునరేషన్ తీసుకుంటోంది. యాడ్స్, వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ నాలుగు చేతులా సంపాదిస్తుంది. ఒక్క ఐటమ్ సాంగ్ చేసినా చాలు కోట్లు వచ్చి పడతాయి. అలాంటి సమంత దగ్గర డబ్బులు లేవా? తనకు వచ్చిన వ్యాదికి చికిత్స కోసం ఓ తెలుగు టాప్ హీరో దగ్గర అప్పు చేసిందా? వివిధ దేశాలు తిరుగుతూ.. తనకు వచ్చిన వ్యాధికి ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సమంత.. ఓ స్టార్ హీరో దగ్గర డబ్బులు తీసుకుందా.. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ విషయంపై ఒకటే రచ్చ.. చర్చ. 

సమంత గతకొంత కాలంగా మాయోసైటిస్ వ్యాధితో భాదపడుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే ఈ వ్యాధి చికత్స కోసం సమంత అమెరికా వెళ్లనుంది అనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇందుకోసం పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుందట. ఇందుకోసం ఒక బడా హీరో నుండి కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకుందని ఆ వార్తల సారాంశం. అయితే ఆ హీరో ఎవరు అనే విషయం మాత్రం తెలియలేదు.  

అయితే కోట్లు సంపాదించిన సమంత ఒక హీరో దగ్గర అప్పు చేయాల్సిన పరిస్థితి ఎందుకొస్తుంది అనేది మరొకరి వాదన. నిజానికి సమంత మొదటి నుంచి స్వతంత్రంగానే ఎదిగింది.. వందల కట్లు సంపాదించింది. హైదరాబాద్ లోనే కొన్ని లగ్జరీ అపార్ట్ మెంట్స్, విల్లాలు ఉన్నాయి. మొన్నటి మొన్న రెండు వెబ్ సిరీస్ లు, రెండు సినిమాలు చేసింది.. కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంది. అలాంటి సమంత.. ట్రీట్ మెంట్ కోసం మరొకరి దగ్గర చేయి చాచటం ఏంటనేది ఆశ్చర్యంగా ఉంది అంటున్నారు అభిమానులు. మరికొంత మంది సమంతపై కుట్ర జరుగుతుందని, ఎవరో కావాలనే ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారనే కామెంట్స్ చేస్తున్నారు.