షణ్ముఖ్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడా.. అందులో నిజమెంత?

షణ్ముఖ్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడా.. అందులో నిజమెంత?

ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ గంజాయి కేసులో పట్టుబడ్డ విషయం తెలిసిందే. తన అన్న వినయ్ సంపత్ కోసం వచ్చిన పోలీసులకు షణ్ముఖ్ గంజాయితో పట్టుబడటంతో అతన్ని, అన్నయ్య సంపత్ వినయ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే షణ్ముఖ్ గంజాయితో పట్టుబడ్డ విషయంలో V6 న్యూస్ ఛానెల్ కి సంచనల వీడియోలు చిక్కాయి. 

ఆ వీడియోలో గత కొన్ని రోజులుగా షణ్ముఖ్ డిప్రెషన్ లో ఉన్నట్లు, ఆత్మహత్య కూడా చేసుకుంటానని చెప్పినట్టుగా తెలుస్తోంది. షణ్ముఖ్ గంజాయి తీసుకుంటున్న సమయంలో ఓ యువతీ వీడియో తీస్తున్నట్టు, ఆ యువతిని షణ్ముఖ్ ఆడుకున్నట్లుగా వీడియోలో రికార్డ్ అయ్యింది. అంతేకాకుండా.. తాను ఇప్పటికే డిప్రెషన్ లో ఉన్నానని, సూసైడ్ చేసుకుంటానని ఏడుస్తూ చెప్పినట్లుగా కూడా ఆ వీడియోలో ఉంది. దీంతో కేవలం డిప్రెషన్ కారణంగానే షణ్ముఖ్ గంజాయికి బానిస అయ్యాడా, లేదా వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు మొదలవుతున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతోంది.