మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేశారా.. ?

మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేశారా.. ?

కేసీఆర్ కు అవసరాల కోసం అన్నీ అవుతయ్.. గానీ పేదోళ్లకు ఇళ్లు కట్టి్ద్దామంటే మాత్రం  మనసురాదని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లక్ష్మిపురంలో జరిగిన ప్రజల గోస.. బీజేపీ భరోసా బైక్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న  ఆయన.. అధికారం లోకి వచ్చే ముందు మేనిఫెస్టోలో పెట్టినవన్నీ చేశారా అని అధికార పార్టీని ప్రశ్నించారు. అసలు తెలంగాణ వచ్చినప్పటి నుండి కేసీఆర్ చెప్పినవి ఏమన్నా పరిష్కరించబడ్డాయా అని నిలదీశారు. 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లిస్తాన్న కేసీఆర్ గారు ఎంత మందికి ఇచ్చారు.. 2018 డిసెంబర్ లో ముఖ్యమంత్రిగా గెలిచిన తరువాత వచ్చిన కొత్త పింఛన్ లు ఎన్ని అని ప్రభుత్వాన్ని అడగండన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు ఇవ్వలేదు... డబుల్ బెడ్ రూమ్ లు ఇస్త అన్నాడు ఇవ్వలేదని ఆరోపించారు. కొత్తగా ఈ మధ్యలో సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవాడానికి 3 లక్షలు ఇస్తం అన్నరు.. కానీ ఎవ్వరికీ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇలా ప్రజల సమస్యలను తెలుసుకొని, ప్రభుత్వం ప్రజలకు చేస్తా అన్న పనులను ప్రజలకు తెలియచేయడమే ప్రజా గోస కార్యక్రమమని మ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. 8 ఏండ్లలో మోడీ గారు ఎం చేశారో, మీరు ఏం చేశారో ఢిల్లీకి పోయి అడుగుదామని అంటే కేసీఆర్ గారు చప్పుడు లేదని విమర్శించారు. వరంగల్ కు వచ్చినప్పుడు జర్నలిస్టులకు చెప్పిండు... డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి మాడల్ జర్నలిస్టుల కాలనీని చేస్త అన్నాడు. కానీ ఏమీ చెయ్యలేదని ఆరోపించారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే ప్రజల దగ్గరకు వెళ్తున్నామన్న ఆయన....  మీరు చెప్పిన వన్ని చేయాలని ప్రతిపక్షం నుండి అడుగుతున్నామని వివరించారు.