
తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ(Sobhita Dhulipala) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా సినిమా చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు ఈ బ్యూటీ. ఇటీవలే ఆమె ఓ హాలీవుడ్ సినిమాలోనూ నటించారు. దేవ్ పాటిల్ హీరోగా వచ్చిన లేటెస్ట్ హాలీవుడ్ మూవీ మంకీ మ్యాన్ సినిమాలో కీ రోల్ చేశారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.
తాజా విషయానికి వస్తే..కల్కి లో శోభిత గూఢచారిలా మారిందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అదేంటీ ఎక్కడ కనిపించలేదని అనుకుంటున్నారా!..సినిమాలో ప్రధాన భాగంలో వినిపించిందండీ. కల్కి సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే క్యారెక్టర్ చాలా స్పెషల్ గా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి పాత్రకు తెలుగు వర్షన్ లో డబ్బింగ్ చెప్పింది శోభిత ధూళిపాళ.అయితే ముందుగా దీపికా పదుకొనేతో(Deepika Padukone) ప్రమోషనల్ వీడియోకి డబ్బింగ్ చెప్పించారంట. కానీ,తన వాయిస్ వర్కౌట్ కాకపోవడంతో..మరెవరితోనైనా చెప్పిస్తే బాగుంటుందని భావించి మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ శోభిత తో చెప్పించారట.
అయితే ఈ విషయం చాలా మందికి లేట్ గా తెలిసింది. కల్కి సినిమా టైటిల్ కార్డ్ లో వేయడంతో పాటు, శోభిత ఆ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో తెలిసిచాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కల్కి సినిమా విషయానికి వస్తే..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కల్కి.జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇండియన్ మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వచ్చిన ఈ సినిమాలో కథ, కథనం, విజువల్స్, గ్రాఫిక్స్, వాటిని నాగ్ అశ్విన్ ప్రెజెంట్ చేసిన విధానానికి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. దాంతో బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. విడుదలైన కేవలం ఐదు రోజుల్లోనే రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది.