
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్సింగ్స్మారకంపై కాంగ్రెస్, బీజేపీ వాగ్వాదం నేపథ్యంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కూతురు శర్మిష్ఠ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి చనిపోయినప్పుడు నివాళి అర్పించేందుకు సీడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని ట్విట్టర్లో కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రపతులకు ఆ సంప్రదాయం పాటించడం లేదంటూ పార్టీలోని ఓ సీనియర్ నేత తనను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. అయితే.. తన తండ్రి డైరీ చదివితే అది నిజం కాదని తెలిసిందని చెప్పారు. మాజీ రాష్ట్రపతి కేఆర్నారాయణన్కు నివాళులర్పించేందుకు సీడబ్ల్యూసీ మీటింగ్ నిర్వహించినట్టు తన తండ్రి డైరీలో రాసుకున్నారని చెప్పారు. కాగా, మన్మోహన్సింగ్ప్రత్యేక స్మారక స్థలానికి అర్హులని పేర్కొన్నారు.