న్యూఢిల్లీ: డీజిల్ రేటు వరసగా రెండో రోజు తగ్గింది. లీటర్ డీజిల్‌పై 20 పైసలు తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గురువారం నోటిఫికేషన్ విడుదల చేశాయి. పెట్రోల్ ధరల్లో మాత్రం మార్పు లేదు. ఢిల్లీలో లీటర్ డీజిల్ రేటు రూ. 89.67 నుంచి రూ. 89.47 కి తగ్గింది. హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ రేటు రూ. 97.53 వద్ద, పెట్రోల్ రేటు రూ. 105.83 వద్ద ఉన్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఆయిల్ ధరలు పడుతుండడంతో లోకల్‌గా డీజిల్ రేట్లను కంపెనీలు తగ్గిస్తున్నాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అసెట్ కొనుగోళ్లను తగ్గిస్తామని సంకేతాలివ్వడంతో కమోడిటీల ధరలు పడుతున్నాయి. క్రూడాయిల్ ధరలు ఈ ఏడాది మే తర్వాత కనిష్ట స్థాయిలను టచ్ చేశాయి.
