
‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా తీసిన రాంగోపాల్ వర్మ మీద కోపంతో జనసేన యూత్ నాయకులు వర్మకు శ్రద్ధాంజలి ఘటిస్తూ కోడూరుపాడులో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీపై ‘నీ ఆకస్మిక మరణం మాకు తీరని లోటు కలిగించాలని, నీ ఆత్మకు ఎట్టి పరిస్థితులలో శాంతి చేకూరకూడదని భగవంతున్ని ప్రార్థిస్తూ..ఇట్లు కుటుంబ సభ్యులు, జనసేన కార్యకర్తలు’ అని రాశారు. అంతేకాకుండా ఫ్లెక్సీపై రాంగోపాల్ వర్మ ఫోటో ముద్రించి దానిపై కీర్తి శేషులు రాంగోపాల్ వర్మ అని రాయించి, దాని కింద మరణం 12-12-2019, పెద్దకర్మ 26-12-2019 అని కూడా రాయించారు. ఈ ఫ్లెక్సీని స్వయంగా దర్శకుడు రాంగోపాల్ వర్మనే తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
ఈ ఫ్లెక్సీపై స్పందించిన వర్మ.. తాను ఈ సినిమాని కేవలం వినోదం కోసమే తీశానని ఆయన తెలిపారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు, లోకేష్ అంటే తనకు చాలా ఇష్టమని వారి అనుచరులపై, ముఖ్యంగా జనసేన కార్యకర్తలపై ప్రమాణం చేశారు.