
పెళ్లిలో వధూవరులను ఆశీర్వదించేందుకు పసుపు, కుంకుమ కలిపిన బియ్యాన్ని అక్షింతలుగా వాడడం కామన్. కానీ, ఈఫ్యామిలీ వాళ్లకు పైసలు బాగా ఉన్నాయేమో! నోట్లనే అక్షింతలుగా చేసి దీవించారు మరి. ఈ పెళ్లి హైదరాబాద్ లోని నాగోల్ లో మార్చి 17న జరిగింది. తాళి కట్టాక వరుడు సుశాంత్ కొత్త, వధువు మేఘనా గౌడ్ లను కుటుంబ సభ్యులు వేదికపైకి తీసుకొచ్చారు. కరెక్ట్‌గా ఎంత కుమ్మరించారో తెలియదు గానీ.. కొన్ని లక్షల రూపాయలతో వారికి దీవెనలిచ్చా రు. సుశాంత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నట్ టు తెలుస్తోంది. కింద పడిన నోట్లను పిల్లలు ఏరుకోవడం కనిపించింది ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.