సర్కారు బడుల్లో డిజిటల్ క్లాసులు వాయిదా

సర్కారు బడుల్లో డిజిటల్ క్లాసులు వాయిదా

హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో డిజిటల్ క్లాసులు మరోసారి వాయిదా పడ్డాయి. ఇటీవల విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో, ఈ నెల 20 నుంచి హైస్కూల్ స్టూ డెంట్లకు డిజిటల్ క్లాసులు ప్రారంభించాలని నిర్ణయించారు. దానిపై అధికారులు ఎక్ససైజ్ కూడా చేశారు. టీచర్లంతా ఈ నెల 17 నుంచే స్కూళ్లకు రావాలని చెప్పినా అమలు చేయలేదు. దీంతో డిజిటల్ క్లాసులపై గందరగోళం నెలకొంది. సర్కారు అనుమతివ్వకపోవడం వల్లే క్లాసులు వాయిదా పడ్డాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలోనే డిజిటల్ క్లాసులు ప్రారంభమయ్యే అవకాశాలున్నట్టు అధికారులు చెబుతున్నా రు. ఇక, దూరదర్శన్, టీశాట్ చానెళ్ల ద్వారా లెసన్స్​ చెప్పాలని విద్యా శాఖ భావించినా.. అన్ని గ్రామాల్లో ఆ చానళ్లు రాకపోవడం, లక్షన్నర మంది స్టూడెంట్ల ఇళ్లలో టీవీలు లేకపోవడంతో వేరే మార్గాలపై అధికారులు దృష్టి పెట్టారు.