- ప్రకటించిన రిలయన్స్ జాయింట్ వెంచర్ కంపెనీ
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రూక్‌ఫీల్డ్, డిజిటల్ రియాల్టీ కంపెనీల జాయింట్ వెంచర్ డిజిటల్ కనెక్షన్ ఆంధ్రాలోని విశాఖపట్నంలో ఒక గిగావాట్ ఏఐ - డేటా సెంటర్‌ను నిర్మిస్తామని ప్రకటించింది. 2030 నాటికి నిర్మాణం పూర్తవుతుందని తెలిపింది. ఇప్పటికే విశాఖపట్నంలో 15 బిలియన్ డాలర్ల (రూ.1.33 లక్షల కోట్ల) తో ఏఐ డేటా సెంటర్ నిర్మించేందుకు గూగుల్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే.
డిజిటల్ కనెక్షన్ తన డేటా సెంటర్‌ను 400 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనుంది. ఇందులో అత్యాధునిక జీపీయూ, టీపీయూ, ఏఐ ప్రాసెసర్లను ఉంచడానికి వీలుంటుంది. తాజాగా జరిగిన సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో ఆంధ్రా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, రిలయన్స్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్ సమక్షంలో దీనికి సంబంధించి ఒప్పందం కుదిరింది.
డిజిటల్ కనెక్షన్‌కు చెన్నైలో ఒక క్యాంపస్ ఉంది. ముంబైలో మరో సెంటర్ నిర్మిస్తోంది. ఏఐ వర్క్‌లోడ్స్‌ను తట్టుకునేందుకు ఈ సెంటర్లను నిర్మిస్తున్నామని కంపెనీ తెలిపింది.
