తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా దిల్ రాజు

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా దిల్ రాజు

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానెల్ ఘన విజయం సాధించింది.  మ్యాజిక్ ఫిగర్ 25 కాగా దిల్ రాజుకు 31 ఓట్లు వచ్చాయి.   దీంతో దిల్ రాజు ప్యానెల్ కు కీలక పోస్టులు దక్కాయి. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా దిల్ రాజు, వైస్ ప్రెసిడెంట్ గా ముత్యాల రామరాజు, సెక్రటరీగా దామోదర వరప్రసాద్, ట్రెజరర్ గా ప్రసన్నకుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తనను బంపర్ మెజారిటీతో  గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు దిల్ రాజు. రేపటి నుంచే యాక్షన్ లోకి దిగుతామని చెప్పారు.  

టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఫిల్మ్‌ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ప్రొడ్యూసర్ సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్, స్టూడియో సెక్టార్, ఎగ్జిక్యూటివ్ సెక్టార్ ఉంటాయి. దాదాపు మొత్తం 1600 మంది సభ్యులు ఉన్నారు.

టీఎఫ్‌సీసీ అధ్యక్ష బరిలో నిర్మాతలు సి. కల్యాణ్, దిల్ రాజు నిలిచారు. దీంతో హోరాహోరీగా ఓటింగ్ ప్రక్రియ సాగింది. ఈ ఎన్నికలు సాధారణ ఎలక్షన్లను తలపించాయి. ఈ ఎన్నికలు ప్రతి రెండేళ్లకోసారి జరుగుతాయి.