RC ఫ్యాన్స్ కోపానికి శాంతి చేసిన శిరీష్ రెడ్డి.. ఇకనైనా చల్లబడతారా..?

RC ఫ్యాన్స్ కోపానికి శాంతి చేసిన శిరీష్ రెడ్డి.. ఇకనైనా చల్లబడతారా..?

మెగా అభిమానులకు.. మరీ ముఖ్యంగా రాం చరణ్ అభిమానులకు ‘దిల్’ రాజు బ్రదర్, నిర్మాత శిరీష్ రెడ్డి క్షమాపణ చెప్పారు. ‘గేమ్ ఛేంజర్’ ఫలితం గురించి తాను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు.. సోషల్ మీడియా కారణంగా అపార్ధాలకు దారి తీశాయని నిర్మాత శిరీష్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమా కోసం తమకు ‘గ్లోబల్ స్టార్’ రామ్ చరణ్ తన పూర్తి సమయాన్ని, సహకారాన్ని అందించారని శిరీష్ ఆ నోట్లో చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి, తమకు ఎన్నో ఏళ్ల నుుంచి సాన్నిహిత్యం ఉందని తెలిపారు. తాము చిరంజీవి, రామ్ చరణ్, ఇతర మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడమని శిరీష్ రెడ్డి ఆ ప్రకటన ద్వారా వెల్లడించారు.

ఒకవేళ తన మాటలు ఎవరి మనోభావాలను అయినా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే క్షమించాలని శిరీష్ రెడ్డి కోరారు. దీంతో.. ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఫలితంపై శిరీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలపై రామ్ చరణ్ అభిమానుల ఆగ్రహావేశాలు’ ఎపిసోడ్కు తెరపడినట్టయింది. నితిన్ ‘తమ్ముడు’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ‘గేమ్ ఛేంజర్’ ఫలితంపై శిరీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానుల్లో ఆగ్రహానికి కారణమైన సంగతి తెలిసిందే.

‘గేమ్ ఛేంజర్’ సినిమా వల్ల తాము అంత ఘోరంగా నష్టపోతే హీరో రామ్ చరణ్ గానీ, డైరెక్టర్ శంకర్ గానీ కనీసం కాల్ చేయలేదని శిరీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రామ్ చరణ్ అభిమానుల్లో కల్లోలం రేపాయి. మూడేళ్లు మరో సినిమా చేయకుండా ‘గేమ్ ఛేంజర్’కు డేట్స్ ఇచ్చిన తమ హీరో గురించి ఇలా మాట్లాడటం ఏంటని RC ఫ్యాన్స్ ఫైర్ కావడంతో వివాదం ముదిరింది. సోషల్ మీడియాలో శిరీష్ రెడ్డిపై, ‘దిల్’ రాజుపై రాం చరణ్ అభిమానులు తీవ్ర విమర్శలు చేశారు.

రామ్ చరణ్ అభిమానులకు ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ పీడ కలగా మారింది. ఈ సినిమా విడుదలై.. డిజాస్టర్ అయి ఆరు నెలలు దాటినా ‘గేమ్ ఛేంజర్’ ఫలితంపై మాత్రం ఏదో ఒక సందర్భంలో చర్చ జరుగుతోంది. శిరీష్ రెడ్డి ఇచ్చిన ఈ వివరణతో అయినా ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ టాలీవుడ్ లో డిస్కషన్ పాయింట్ కాకుండా ఉంటుందో.. లేదో చూడాలి.

►ALSO READ | Fish Venkat: పాపం ఫిష్ వెంకట్.. వెంటిలేటర్పై ట్రీట్మెంట్.. ఆయనకు అసలు ఏమైందంటే..