Fish Venkat: పాపం ఫిష్ వెంకట్.. వెంటిలేటర్పై ట్రీట్మెంట్.. ఆయనకు అసలు ఏమైందంటే..

Fish Venkat: పాపం ఫిష్ వెంకట్.. వెంటిలేటర్పై ట్రీట్మెంట్.. ఆయనకు అసలు ఏమైందంటే..

తెలుగు సినీ నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. విలన్ గ్యాంగ్లో కనిపిస్తూ నవ్వులు పూయించే ఫిష్ వెంకట్ ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నాడు. ఆయన కిడ్నీలు పూర్తిగా పాడయిపోవడంతో వైద్యులు డయాలసిస్ చేస్తున్నారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు. కొన్ని నెలల క్రితం ఇలానే ఫిష్ వెంకట్ అనారోగ్యానికి గురికావడంతో చికిత్స అందించారు. ఆ సమయానికి ఆయన ఆరోగ్యం మెరుగుపడింది. మళ్లీ.. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే ఆయన కోలుకోవడానికి ఉన్న ఒకేఒక్క ఆప్షన్ అని వైద్యులు తేల్చి చెప్పారు.

వన్లైనర్స్తో, తెలంగాణ యాసతో ఫేమస్ అయిన ఫిష్ వెంకట్ మళ్లీ కోలుకుని మాములు మనిషి కావాలంటే ఆయన వైద్యానికి చాలానే ఖర్చవుతుంది. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆయన కుటుంబం ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది. సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా స్పందించి ఫిష్ వెంకట్ వైద్యానికి సాయం చేయాలని ఆ కుటుంబం కోరుతోంది. ఫిష్ వెంకట్కు భార్య, ఒక కూతురు ఉన్నారు. హాస్పిటల్ బిల్లులు పెరిగిపోతుండటంతో ఆయన కుటుంబం ఆందోళనలో ఉంది. ఫిష్ వెంకట్కు ఈ పరిస్థితుల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అండగా నిలుస్తుందని ఆ కుటుంబం ఆశగా ఎదురుచూస్తోంది.

►ALSO READ | హీరోయిన్‌‌గా మోహన్‌‌ లాల్ కూతురు

ఎంతోమంది ముఖాల్లో నవ్వులు పూయించిన ఫిష్ వెంకట్కు ఈ పరిస్థితి రావడంపై ఈ విషయం తెలిసిన వారంతా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఫిష్ వెంకట్ స్పృహలోనే ఉన్నప్పటికీ ఎవరినీ గుర్తుపట్టలేకపోతున్నాడు. కొన్నేళ్ల క్రితమే ఆయనకు బీపీ, షుగర్ ఎటాక్ అయి ఇన్ఫెక్షన్ పెరిగిపోవడంతో కాలికి ఆపరేషన్ చేశారు. ‘ఆది’ సినిమాలో ‘తొడ కొట్టు చిన్నా’ అని ఫిష్ వెంకట్ చెప్పిన డైలాగ్ అప్పట్లో తెగ పాపులర్ అయింది. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాలో ఫిష్ వెంకట్ క్యారెక్టర్ ఫుల్ ఫన్ పంచింది. ఇలా చాలా సినిమాల్లో ఫిష్ వెంకట్ క్యారెక్టర్ తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది.