
మలయాళ స్టార్ మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ హీరోగా రాణిస్తుండగా ఇప్పుడు ఆయన కూతురు విస్మయ కూడా మాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మంగళవారం (జులై 01) ఆ వివరాలను మోహన్ లాల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
విస్మయ లీడ్ రోల్‌లో ‘తుడక్కమ్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ సంస్థ నిర్మిస్తోంది. కేరళ వరదల నేపథ్యంలో ‘2018’ అనే సినిమా తీసి మెప్పించిన జూడ్ ఆంథోని జోసెఫ్ దీనికి దర్శకుడు. ఇక విస్మయ స్వతహాగా రచయిత్రి, పెయింటర్. నాలుగేళ్ల క్రితం ‘గ్రైన్స్ ఆఫ్ స్టార్‌డస్ట్’ పేరుతో ఓ బుక్ రాసింది.
అలాగే మార్షల్ ఆర్ట్స్‌లోనూ ఆమెకు ప్రావీణ్యం ఉంది. ఇక ఈ సినిమా ఏ జానర్‌లో ఉండబోతోంది, ఇతర నటీనటులు ఎవరు అనే విషయాలను త్వరలో రివీల్ చేయనున్నారు.