ముగ్గురు అనాథ పిల్లలను దత్తత తీసుకున్న దిల్ రాజు

 ముగ్గురు అనాథ పిల్లలను దత్తత తీసుకున్న దిల్ రాజు

తెలుగు సినీ ఇండస్ట్రీకి కొత్తవారిని పరిచయం చేయడంతో పాటు మంచి టేస్ట్ ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు దిల్ రాజు. వ్యక్తిగత జీవితంలో కూడా మంచి పనులతో తన సహృదయాన్ని చాటుకుంటూ ఉంటారు. రీసెంట్ గా ముగ్గురు అనాథ పిల్లలను దత్తత తీసుకుని మనసున్న మారాజు అనిపించుకున్నారు.

యాదాద్రి జిల్లా ఆత్మకూరు గ్రామానికి చెందిన సత్తయ్య సంవత్సరం క్రితం అనారోగ్యం తో మరణించాడు. దీంతో పిల్లలు మనోహర్, లాస్య, యశ్వంత్ ల బాధ్యత సత్తయ్య భార్య అనురాధపై పడింది. కూలి పనికి వెళ్తూ ముగ్గురు పిల్లలను చూసుకుంటోంది. వారం రోజుల క్రితం అనురాధ కూడా అనారోగ్యంతో చనిపోయింది. దీంతో పిల్లలు అనాథలుగా మారిన విషయాన్ని ఎమ్మెల్యే ద్వారా తెలుసుకున్న దిల్‌‌‌‌ రాజు చలించిపోయారు. ఆ ముగ్గురినీ దత్తత తీసుకునేందుకు ముందుకొ‌‌‌‌చ్చారు. ‘ఇంత చిన్న వయసులో తల్లిదండ్రుల్ని కోల్పోవడం చాలా బాధాకరం. వారికి సాయపడే అవకాశం వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. మా కుటుంబం స్థాపించిన మా పల్లె చారి టబుల్ ట్రస్ట్ ద్వారా వారి పూర్తి బాధ్యతను మేమే తీసుకుంటున్నాం’ అని చెప్పారు.