
అభినవ్ మెడిశెట్టి, సాషా సింగ్, విస్మయ శ్రీ, లవ్లీ సింగ్ ముఖ్యపాత్రల్లో మంకల్ వీరేంద్ర , రవికుమార్ సబ్బాని తెరకెక్కించిన చిత్రం ‘దిల్ సే’. ఆగస్టు 4న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడుకు కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ‘మేకింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
మంచి చిత్రాలు నిర్మించాలని ఇండస్ట్రీకి వచ్చిన మక్కల్ వీరేంద్ర గారికి ఈ సినిమాతో చక్కని గుర్తింపు రావాలని కోరుకుంటున్నా’ అన్నారు. సినిమా సక్సెస్ సాధించాలని మరో అతిథి నిర్మాత బెక్కం వేణు గోపాల్ విష్ చేశారు. ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని కమర్షియల్ అంశాలున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇదని దర్శకనిర్మాతలు చెప్పారు. టీమ్ అంతా పాల్గొన్నారు.