దిల్సుక్నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో నిందితుడిగా ఉన్న ఇండియన్ ముజాహిద్దీన్ చెందిన ఉగ్రవాది మృతి చెందాడు. చర్లపల్లి జైలులో ఖైదీగా ఉన్న సయ్యద్ మక్బూల్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ గాంధీ ఆస్పత్రిలో మృతి చెందాడు. దేశవ్యాప్తంగా జరిగిన పలు బాంబు దాడుల్లో మక్బూల్ హస్తం ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. దిల్ సుక్ నగర్ బ్లాస్ట్ కేసులో గతేడాది సయ్యద్ కు జీవిత ఖైదు విధించింది ఢిల్లీ కోర్టు.
అప్పటి నుంచి తీహాడ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు మక్బూల్. ఆరు నెలల క్రితం హైదరాబాద్, తెలంగాణలో నమోదైన కేసుల కారణంగా ట్రాన్సిట్ వారెంట్ పై అధికారులు తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సయ్యద్ మక్బూల్ చికిత్స పొందుతూ గాంధీ ఆస్పత్రిలో మృతి చెందాడు.
