వేణుస్వామితో పూజలు చేయించిన డింపుల్‌ హయతి

 వేణుస్వామితో పూజలు చేయించిన డింపుల్‌ హయతి


ఇటీవలే ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే ఇష్యూతో వార్తల్లో నిలిచిన టాలీవుడ్ యంగ్ హీరోయిన్ డింపుల్‌ హయతి(Dimple hayathi) ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి(Venu Swamy)తో హైదరాబాద్ లోని తన అపార్ట్ మెంట్ లో రహస్యంగా పూజలు చేయించింది. దాదాపు మూడు గంటల పాటుగా పూజలు జరిపినట్లు సమాచారం.  దీనికి సంబంధించిన ఫొటోలు,వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  కారు పార్కి్ంగ్ విషయంలో పోలీస్ అధికారితో గొడవకు దిగిన డింపుల్‌ దాని నుంచి ఉపశమనం పొందేందుకే శాంతి పూజ చేయించినట్లుగా తెలుస్తోంది.  

ఇక వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. స్టార్ హీరోయిన్లు కూడా ఇతనితో పూజలు, హోమాలు చేయించుకుంటారు .ఇప్పటికే రష్మిక మందన్నా, నిధి అగర్వాల్ వేణు స్వామితో పూజలు చేయించుకున్న వారి లిస్ట్ లో ఉన్నారు. తాజాగా ఆ లిస్టులోకి డింపుల్‌ కూడా చేరిపోయింది.

ఇక డింపుల్ సినీ కెరీర్ విషయానికి వస్తే తెలుగమ్మాయి, అందులోనూ టాలెంట్ ఉన్నప్పటికీ సరైన హిట్ పడటంలేదు. ఇటీవల రవితేజ(Ravi Teja) ఖిలాడీ, గోపీచంద్(Gopi Chand) తో చేసిన రామాబాణం చిత్రాలు దారుణంగా ప్లాప్ అయ్యాయి.  వరుస ఫెయిల్యూర్స్, పోలీస్ అధికారితో గొడవ కారణంగా  డింపుల్‌ ను కాస్త డిప్రెషన్ లోకి నెట్టేశాయి. ఈ క్రమంలో తన ఇంట్లో వేణు స్వామితో శాంతిపూజ చేయించిందని సమాచారం.