ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించిన దినేశ్ కార్తీక్!

ఐపీఎల్కు  రిటైర్మెంట్ ప్రకటించిన దినేశ్ కార్తీక్!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ దినేశ్ కార్తీక్ ఐపీఎల్ కు  రిటైర్మెంట్ ప్రకటించారు. మే22 బుధవారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో  బెంగళూరు ఓడిన అనంతరం కార్తీక్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు.  గ్రౌండ్ లో  ఆయనకు ఆర్సీబీ ప్లేయర్లు, అభిమానులు ఘన వీడ్కోలు పలికారు. మైదానం నుంచి డగౌట్‌కు వెళుతుండగా.. కార్తీక్ తన గ్లౌజులు తీసి ప్రేక్షకులకు అభివాదం చేశాడు.  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  కార్తీక్ తన రిటైర్మెంట్‌ను ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఈ సన్నివేశాలన్నీ చూస్తే అతనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అనిపిస్తుంది.  

కాగా ఈ సీజన్లో ఆర్సీబీ ఫినిషర్ గా దినేశ్ కార్తీక్  అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. మొత్తంగా ఆర్సీ బీ తరఫున కార్తీక్  937 పరుగులు చేశారు. ఓవరాల్ గా ఐపీఎల్ లో 6 టీమ్ లకు ఆడిన కార్తీక్.. 257 మ్యాచుల్లో 4 వేల 842 రన్స్ చేశారు.  ఇందులో 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. డీకే అత్యధిక స్కోర్ 97 నాటౌట్. కీపర్‌గా 145 క్యాచ్‌లు, 37 స్టంప్‌ ఔట్లు, 15 రనౌట్స్ చేశాడు.  అటు సోషల్ మీడియాలో కూడా   దినేశ్ కార్తీక్ ను మిస్ అవుతామంటూ నెట్టింట ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

దినేష్ కార్తీక్ తన ఐపీఎల్ ప్రయాణాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ (2008-2010, 2014)తో ప్రారంభించాడు, ఆ తర్వాత అతను పంజాబ్ కింగ్స్ (2011), ముంబై ఇండియన్స్ (2012-2013), గుజరాత్ లయన్స్ (2016-2017), కోల్‌కతా నైట్ రైడర్స్ (2016 2017 ) కోల్‌కతా నైట్‌ రైడర్స్ (2018-2021)రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (2015, 2022-2024) తరుపున ఆడాడు.  ఇందులో  కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు కార్తీక్.  2013లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్నప్పుడు కార్తీక్ ఆ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.