దీపాన్షుకు గోల్డ్

దీపాన్షుకు గోల్డ్

దుబాయ్‌ ‌‌‌:  ఆసియా అండర్ 20 అథ్లెటిక్స్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఇండియా తొలి రోజే  అదరగొట్టింది.   బుధవారం జరిగిన మెన్స్ జావెలిన్‌‌‌‌ త్రో ఈవెంట్‌‌‌‌లో దీపాన్షు శర్మ 70.29 మీటర్ల దూరంతో గోల్డ్ మెడల్ నెగ్గాడు.

రోహన్‌‌‌‌ 70.03 మీటర్లతో  రెండో ప్లేస్‌‌‌‌తో సిల్వర్ గెలిచాడు. డిస్కస్‌‌‌‌ త్రోలో రితిక్‌‌‌‌ 53.01 మీటర్లతో సిల్వర్ ఖాతాలో వేసుకున్నాడు. మెన్స్‌‌‌‌ 1500 మీ. ఈవెంట్‌‌‌‌లో ప్రియాన్షు  3:50.85 టైమింగ్‌‌‌‌తో సిల్వర్ గెలిచాడు.